400వ షోరూంను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
1 min read
విజయవాడ, న్యూస్ నేడు : ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ఆభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, తమ 400వ షోరూం ప్రారంభోత్సవంతో, అంతర్జాతీయంగా స్థాయిలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది, ఈ సందర్భాన్ని సగర్వంగా వేడుక చేసుకుంది. మలబార్ యొక్క 400వ షోరూం ప్రారంభోత్సవం అనేది, భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మలబార్ ఉనికిని మరింతగా పెంచే లక్ష్యంతో కూడిన విస్తృతమైన, ప్రతిష్టాత్మక వృద్ధి వ్యూహంలో భాగం. ప్రస్తుతం 63,000 కోట్ల టర్నోవర్ మరియు 13 దేశాలలో ఉనికి కలిగిన మలబార్, తమ బ్రాండ్ ఆదాయాన్ని 78,000 కోట్ల రుపాయలకు పెంచాలని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 దేశాలు మరియు భారత దేశంలోని 22 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.మలబార్ తన రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తున్న కొద్దీ, ఉపాధి సృష్టించడానికి కట్టుబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 27,250 మంది నిర్వహణ బృంద సభ్యులతో తమ శ్రామిక శక్తిని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ షోరూము ప్రారంభోత్సవం సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ మాట్లాడుతూ, “నోయిడాలో మా 400వ షోరూమ్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ మైలురాయి మా వృద్ధి ఆశయాలకు నిదర్శనం. భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా నంబర్ 1 గ్లోబల్ జ్యువెలరీ రిటైలర్‌గా పేరుగాంచాలంటే మా ప్రయాణంలో నిరంతరం విస్తరిస్తున్న మా అడుగుజాడలను సూచిస్తుంది. మా లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన మా కస్టమర్లు, నిర్వహణ బృందం సభ్యులు, వాటాదారులు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కొత్త షోరూమ్‌లు మరియు తయారీ యూనిట్లను స్థాపించడం మరియు 78,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది పొంది, వృద్ధిని పెంచడానికి 5,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టడం కోసం ఒక సమగ్ర వ్యాపార వ్యూహాన్ని అమలు చేస్తున్నాము.” అన్నారు.

