రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్ర తాంబూలం …
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
22,23,24, డివిజన్ లలో నాలుగు కోట్ల రూపాయలతో అంతర్గత సిసి రోడ్లు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. అభివృద్ధికి బాటలు వేసేక్రమంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏలూరులో శాంతినగర్ నుండి సెయింట్ ఆన్స్ కాలేజ్ వరకూ 22, 23, 24 డివిజన్‌ల పరిధిలో 4కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్డు నిర్మాణానికి గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్‌లు శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసిపి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాడైపోయిన రహదారుల పునర్నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీనికి అవసరమైన కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయడంతో రహదారుల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయగలిగామన్నారు. దీంతో ఎక్కడ చూసినా రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా నూతన రహదారుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్దవహించాలని ఎమ్మెల్యే సూచించారు. నగర మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే బడేటి చంటి సారధ్యంలో నగరంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ పెదబాబులకు అత్మీయ స్వాగతం లభించింది. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్,కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కలవకొల్లు సాంబ, నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, గూడవల్లి వాసు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కేతినేడి భాస్కరరావు,అట్లూరి రామకృష్ణ,అన్నపనేని రవికుమార్,కడియాల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
