ప్రగతి ప్రాజెక్టు కు కృతజ్ఞతలు… హెచ్.ఎం. బ్రమరాంబ
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు నేడు “ప్రగతి ప్రాజెక్టు” సంస్థ వారు ప్రయోగశాలలో ఉపయోగించే గణితం మరియు సైన్సు కు సంబంధించిన పరికరాలను పాఠశాలకు అందజేసినందుకు హెడ్మాస్టర్ భ్రమరాంబ ప్రగతి ప్రాజెక్టుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ, పాఠ్యాంశంను బోధించే సమయంలో ఈ సైన్సు గణితం పరికరాలను ఉపయోగించి పాఠ్యాంశాన్ని బోధిస్తే మనసుకు హత్తుకుంటుందని, వాటిని కలకాలం గుర్తు పెట్టు కుంటారని, పాఠం సులభంగా అర్థమవుతుందని ఆమె తెలిపారు. కాబట్టి ప్రతిసైన్స్ మరియు గణితం టీచర్లు తప్పనిసరిగా వీటిని ఉపయోగిస్తూ పాఠ్యాంశాన్ని బోధించాలని ఆమె సూచించారు. పేద విద్యార్థుల కోసం సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రగతికి సహాయ సహకారాలు అందిస్తున్న” ప్రగతిప్రాజెక్టు “సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులు భారతి, ఆరాధన, పద్మజ, గంగాదేవి, రాజశేఖర్ ,బాలరాజు,గణితం టీచర్లు రజని, పద్మావతి ,నాగలక్ష్మి ,శశికళ మరియు సత్యనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు.
