అన్నదాతకు తీరని నష్టాలు… కష్టాలు
1 min read
మహానంది, న్యూస్ నేడు: అన్నదాతకు తీరని నష్ట లు.. కష్టాలు వెన్నంటుతూనే ఉన్నాయి. ఆరుగాలం శ్రమించి కష్టానికి నష్టానికి చెమటోడ్చి , అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండిన పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ పాలకులకు మాత్రం రైతుల కష్టనష్టాలు కనపడవా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వేదికలపై మాత్రమే రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీలు గుప్పిస్తూనే ఉంటారు. మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో ఖరీఫ్ సీజన్లో వరి మరియు మొక్కజొన్న రైతులకు తుఫాను మరియు పెనుగాలుల వల్ల తీవ్రంగా నష్టపోయారు. కానీ నేటికీ కూడా రైతులకు ఆర్థిక సహాయం సహాయం అందలేదు. కారణం పెనుగాలులు విచాయి గాని అత్యధిక వర్షపాతం నమోదు కాలేదని ఈ కారణం చేతనే రైతులకు అందాల్సిన సహాయం అందలేదని తెలుస్తుంది. ప్రస్తుతం రబీ సీజన్లో కూడా వరి ,అరటి, ఆరబోసిన పసుపు ఇతర పంటలు అకాల వర్షాలు, పెనుగాలుల వల్ల దెబ్బతిన్నాయి. ఒక ఏడాదిలో రెండుసార్లు రైతులు తీవ్రంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన ప్రజాప్రతినిధుల్లో కానీ, ఉన్నత స్థాయి అధికారుల్లో కానీ చలనం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇంకా ఎంత నష్టం జరిగితే రైతుల వైపు కన్నెత్తి చూస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తుంది. ఇంతకు అధికారిక లెక్క ప్రకారం ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వియ్యాలి, ఎంత వర్షపాతం నమోదు అయితే రైతుల కష్టాలు, నష్టాలు గట్టెక్కుతాయి అనేది చర్చనీయాంశంగా మారింది. కళ్ళేదుట పంటలు దెబ్బతిని రైతులు లబోదిబోమని మొత్తుకుంటుంటే, సరైన వర్షపాతం నమోదు కాలేదు అందుకే ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు సంబంధించి సమాచారం క్రింది స్థాయి అధికారులు సేకరించి నివేదికలు పంపిన పక్కన పడేసినట్లు సమాచారం. ప్రస్తుతం రబీ సీజన్లో కూడా నష్టపోయిన రైతులకు సంబంధించి క్రింది స్థాయి సిబ్బంది అధికారులు వివరాలు సేకరించి పంపిన కూడా పాత పద్ధతిలోనే అవలంబిస్తారా లేక వాస్తవ పరిస్థితులు గమనించి రైతులకు న్యాయం చేస్తారా అనేది పాలకులు , ఉన్నత స్థాయి అధికారులు చిత్తశుద్ధి, వారి నిర్ణయ ల పై రైతుల గుండె చప్పుళ్ళు ఆధారపడి ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది.
