మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసిన పోలవరం ఎమ్మెల్యే
1 min read
జల మిషన్ నిధులతో49.90 లక్షల అంచనా విలువతో నిర్మాణం
కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి పనులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కొయ్యలగూడెం మండలంలో 60 వేల లీటర్ల మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల మిషన్ నిధులతో 49.90 లక్షల అంచనావిలువ తో మంచి నీటి ట్యాంకును నిర్మిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు అభివృద్ధి పనులు మరిన్ని జరగనున్నాయి అన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీను,బిజెపి పోలవరం నియోజకవర్గం కన్వీనర్ నిర్మల కిషోర్,చొడిపిండి సుబ్రహ్మణ్యం,జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ తోట రవి , టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీను, మండల బిజెపి ప్రెసిడెంట్ గొలిశెట్టి , టిడిపి మండల ప్రెసిడెంట్ పారేపల్లి నరేష్ , జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు అల్లం సత్తిరాజు, సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి, ఆర్ డబ్ల్యు ఎస్, డిఇ, ఏఇ, పి ఆర్ డిపార్ట్మెంట్ డిఈ,ఎఇ, పంచాయతీరాజ్ ఎంపీడీవో, సెక్రటరీలు, పోలీస్ శాఖ ఎస్సై, ఎన్ డి ఏ కూటమి నాయకులు,కార్యకర్తలు, నీటి సరఫరా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.