ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే బడేటి నిరంతర యజ్ఞం
1 min read
స్నేహపూర్వక వాతావరణం లో ప్రజలంతా సంతోషం
క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్వేచ్ఛాయుతమైన స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలంతా సంతోషంగా జీవించాలన్నదే తన ఆకాంక్ష అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు తమ సమస్యలను విన్నవించేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి,,, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంతోనే అసలైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏలూరు నియోజకవర్గంలో స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నానన్న ఆయన,,, రానున్న కాలంలో ప్రజాసమస్యలన్నింటికీ చెల్లుచీటి ఇచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఏలూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన న్యాయవాది ఏవి నారాయణ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావులను కలుసుకుని పుష్పగుచ్చాలు అందించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం న్యాయవాది నారాయణను ఎమ్మెల్యే బడేటి చంటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, నగర పార్టీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, టిడిపి నాయకులు చిరంజీవి, గూడవల్లి వాసు, నౌడూరి వాసు, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
