బాధ్యతలు చేపట్టిన ఏపీఓ నాగమ్మ..సిబ్బంది
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ గా శుక్రవారం పెయ్యల నాగమ్మ మరియు ఉపాధి సిబ్బంది బాధ్యతలు చేపట్టినట్లు ఎంపీడీఓ పి.దశరథ రామయ్య తెలిపారు.ఈమే ఆత్మకూరు నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు.అదే విధంగా ఈసీ షబాన నందికొట్కూరు నుండి ఇక్కడికి వచ్చారు.టెక్నికల్ అసిస్టెంట్లు ఇతర మండలాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు జూపాడు బంగ్లా నుండి ఇజ్రాయేల్ రాజ్,సబితా రాణి, నందికొట్కూరు నుండి ఉమా మహేశ్వరయ్య,గడివేముల నుండి శ్రీవాణి,సీఓ శేష గిరిరావు,శ్రీనివాస రెడ్డి మిడతూరుకు వచ్చినట్లు శనివారం సాయంత్రం ఎంపీడీవో తెలిపారు.