ప్రజారోగ్యన్ని సంరక్షించుటలో పరిసరాల పరిశుభ్రత ప్రధాన భూమిక పోషిస్తుంది
1 min readజిల్లా కోఆర్డినేటర్ గుర్రాల ప్రసంగిరాజు
బాధ్యతతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచులకు, కార్యదర్శులకు ఆదేశాలు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకవలసిన బాధ్యత ప్రజలందరిపై ఉంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజారోగ్యాన్ని సంరక్షించుటలో పరిసరాల పరిశుభ్రత ప్రధాన భూమిక పోషిస్తుందని సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్ గుర్రాల ప్రసంగి రాజు పేర్కొన్నారు. బుదవారం కొయ్యలగూడెం మండలములోని పరింపూడి, బయ్యనగూడెం, రామానుజపురం, వేదాంతపురం, పొంగుటూరు పంచాయతీలలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. . ఈ సందర్భంగా ప్రసంగి రాజు మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ ను సమర్ధవంతంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలైన గ్రామపంచాయతీలపై ఉందని అందుకు పారిశుధ్య నిర్వహణలో పరిసరాలను పరిశుబ్రంగా ఉంచాల్సిన భాధ్యత ప్రజల అందరిపైనా ఉందని గుర్తుచేసారు . నిర్వీర్యముగా నున్న సంపద కేంద్రాలను ఖచితంగా వినియోగంలోనికి తీసుకురావటానికి ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని ఆదేశాలిస్తూ సర్పంచ్ కార్యదర్శులను కోరారు. జీవన నాణ్యతను మెరుగుపరచడంలో పారిశుధ్యము కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. చెత్తను తగలపెట్టడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని ఇకపై చెత్తను తగలపెట్టవద్దని కోరారు. ఎక్కడ మురుగు అక్కడే ఉంటె సీజనల్ వ్యాధులు ప్రబలుతయాన్నారు. విస్తరణ అధికారి సతీష్ కుమార్, పరింపూడి, బయ్యనగూడెం సర్పంచులు , రామానుజపురం, వేదాంతపురం, పరింపూడి, బయ్యనగూడెం, పొంగుటూరు పంచాయతీల కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.