విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర శివారు జీ. పుల్లారెడ్డి నగర్ లోని విజ్ఞాన పీఠం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో 10వ ప్రపంచ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 21-6-24ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కుటుంబ ప్రబోధన్ కార్యకర్త శ్రీ రాం ప్రసాద్ గారు మాట్లాడుతూ యోగ అనేది మనిషిని మానసికంగా, శారీరకంగా వికసితం చేస్తూ , జీవితాన్ని సమగ్ర దిశలో పయనింప చేయడానికి ముఖ్యసాధనమని తెలిపారు. ఇది కేవలము వ్యాయామం కాదు. శరీరము ,బుద్ధి, మనస్సు మూడు బాగుంటేనే వికాసవంతుడవుతాడని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా విజ్ఞాన పీఠం వ్యాయామ ఉపాధ్యాయుల శ్రీ రామిరెడ్డి గారు మాట్లాడుతూ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఐక్యరాజ్యసమితిలో యోగాను ఇంకా విస్తరించడానికి ప్రపంచవ్యాప్తంగా అందరి ఆరోగ్యం కోరుతూ ముందుకు వెళుతున్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో చంద్రమోహన్, రణధీర్ రెడ్డి, సుదర్శన్ రావు, స్వర్ణలత ,నాగేశ్వర్ రెడ్డి ,సోమయ్య, వంశీ రాఘవ , హిమాయత్ , రేణుకా, రాజశేఖరరెడ్డి , నాగిరెడ్డి రఘు తదితరులు పాల్గొని ప్రసంగించారు.