వేసవిలో… చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం
1 min read
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఎస్ ఎం ఆర్ పెదబాబు
తంగిరాల మోజెస్ జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఏలూరు, న్యూస్ నేడు జిల్లా ప్రతినిధి: కండ్రిక గూడెం సెంటర్ నందు చలివేంద్రం శనివారం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి డిప్యూటీ మేయర్లు పప్పు ఉమా మహేశ్వర రావు, వందనాల దుర్గ భవాని శ్రీనివాస్, టౌన్ సెక్రెటరీ రెడ్డి నాగరాజు పాల్గొని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఎస్ ఎం ఆర్ పెదబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ బాబు మరియు తంగిరాల జోసఫ్,28వ డివిజన్ టిడిపి కార్యకర్తలు వీరభత్తుల రామారావు, మచ్చ ఉమామహేశ్వర రావు, షేక్ రఫీ, సింగారపు శ్రీరాములు,ఇద్ధం దుర్గ రావు, కోడి జగదీష్ చింతల శ్రీనివాస్ షేక్ సైదులు పాల్గొన్నారు.