PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టండి

1 min read

పెండింగ్ లో ఉన్న రోడ్డు మరమ్మత్తుల పనులను త్వరతగతిన పూర్తి చేయండి.

గుంతలు పడిన రోడ్లను యుద్ధప్రాతిపదిన పూడ్చి వేయండి

ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ

ఆదోని అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టండి

ప్రభుత్వ స్థలాలలో అనాధికారమైన కట్టడాలపై చర్యలు తీసుకోండి

రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ ఉండే సూచన ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలో ఉన్న మరమ్మత్తులను పూర్తి చేయండి

ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పి. వి పార్థసారథి.:-

పల్లెవెలుగు వెబ్ ఆదోని: వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి –  ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సమీక్షలు జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి  ఆరా తీశారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపదన పూడ్చాలని ఆర్ అండ్ బి అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆదోని పట్టణంలో పార్కింగ్ సమస్య ఎక్కువ ఉన్నందువలన వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ముఖ్యంగా నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.ఎమ్మెల్యే డాక్టర్ పి. పార్థసారథి మాట్లాడుతూ… ఆదోని అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే పార్థసారధి సూచించారు. ముఖ్యంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ రహదారులు ప్రభుత్వ భవనాలను త్వరగతిన గుర్తించి తక్షణమే ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాబోయే రోజుల్లో అధిక వర్షపాతం పడే సూచన ఉన్నందువలన లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి ఏటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వాటిపై చర్యలు తీసుకొని అవసరమైన మేరకు కొన్ని పరిస్థితులను సుమోటో గా కంప్లైంట్ తీసుకొని శాంతిభద్రతలు పరిరక్షించాలన్నారు. ముఖ్యంగా రాంజుల చెరువులో ప్రస్తుతం ఉన్న నీటిని తొలగించి వర్షపు నీటిని ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ కార్యక్రమానికి కార్యాలయపు పరిపాలన అధికారి సి ఆర్ శేషయ్య, ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి, ట్రైని డిఎస్పి ధీరజ్, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర్ రెడ్డి, ఆర్టీవో నాగేంద్ర, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షీశిర దీప్తి,  ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, , పోలీసు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author