ఏలూరు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎస్ హరినాథ్
1 min readమీ అఖండ విజయం అభినందనీయం
నగర అభివృద్ధి అవసరాలను ఎమ్మెల్యే దృష్టికి, పౌరుడిగా కొన్ని సూచనలు సలహాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి అఖండ విజయం వెనుక ఏలూరు ప్రజలతొ పాటు ఉద్యోగస్తుల పాత్ర ఘననీయం అన్న సంగతి అందరికీ తెలుసు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని తన క్యాంప్ కార్యాలయంలో ఆర్ఎస్ హరినాథ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఏపీ ఎన్జీవోస్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుల బోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరినాథ్ కొన్ని విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఆవలంభించిన ఉద్యోగ వ్యతిరేక విధానాలు పట్ల విసుగు చెంది ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని. ముఖ్యంగా ఏలూరు నగర అభివృద్ధికి ఒక పౌరిడిగా మీకు విన్నవించునది ఏమిటంటే నిత్యం రద్దిగా వుండే ఆర్ఆర్ పేట మెయిన్ రోడ్ పరిస్థితి బావుండలేదు మరియు నగరంలో కొన్ని రోడ్ల పరిస్థితి అద్వానం గా వున్నాయి. అద్వానంగా వున్న ఏలూరు పార్కులను అభివృద్ధి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కృష్ణ కాలువని ప్రక్షాళన చేసి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో చెత్త వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి కోల్పోయిన జ్యూట్ మిల్ కార్మికుల కుటుంబాల రక్షణకు ప్రత్యేక చర్యలతో చొరవ చూపాలన్నారు. జ్యూట్ మిల్ ఫ్లైఓవర్ రక్షణ గోడలు పటిష్టం చేయుట, వరదలు సమయంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన మరియు ప్రమాదం గా వున్న తూర్పు లాకులు, పడమర లాకుల పునర్ నిర్మాణం తమ్మిలేరు వరధలు నుండి ఏలూరు ను రక్షించుటకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నగర పరిధి లోని ముక్యంగా అశోక్ నగర్ బ్రిడ్జి నుండి తూర్పు లాకుల వరకు మరియు పడమర లాకులు, సాయి నగర్ వరకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం,పొనంగిలో అసంపూర్ణం గా వున్న టిడ్కో ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందచేయుట లో యుద్ధ ప్రాతిపదికన అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఏలూరు దత్తాఆశ్రమం మరియు చోదిమెళ్ల మధ్య ప్రవహిస్తున్న తమ్మిలేరుపై వంతెన నిర్మాణం చేయగలిగితే హైవేకి ప్రయాణం సులభం అయ్యి ప్రజలకు ఉపయోగం కలుగుతుందన్నారు. ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియం లను అభివృద్ధి చేసి క్రీడాకారులకు, వాకర్స్ కు అందుబాటులోకి తేవడం తో పాటు విద్యార్థులకు ఉపయోగపడు మరియు నిరూపయోగంగా వున్న జిల్లా సైన్స్ పార్క్ ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. మెడికల్ కాలేజి నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ క్రమబద్దికరణ కొరకు చర్యలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు కొరకై తగిన చర్యలు మరియు సీసీ కెమెరాలు వినియోగంలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేషన్లో విలీనం కాబడిన పంచాయతీలలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం డ్రైనేజీ పూడికలు తీసి ముంపు నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అద్దె భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోటు వుండేలా ఒక కాంప్లెక్స్ నిర్మించి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. తక్కువ ధరల్లో శుభ కార్యాలు చేసుకొనుటకు అందుబాటు ధరల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని, YMHA హాల్ ఆధునీకరణకు చేయూత ఇచ్చి కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. నగరం లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంచే లే అవుట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించే ధరలకు స్థలాలు ఇప్పించేలా కృషి చేయాలని ఇవి కాకుండా మీ ఎన్నికల పాదయాత్ర లో ప్రజల నుండి ఇతర వర్గాల నుండి మీ దృష్టికి వచ్చిన ఇతర సమస్యలు కూడా ప్రాదాన్యత క్రమంలో పూర్తి చేసి ఏలూరు ను మీ హయాంలో అభివృద్ధి పదంలో నడిపించి బడేటి వంశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నగర అభివృద్ధిని ఆకాంక్షించే వారిలో ఒక పౌరుడిగా విన్నవించుకుంటున్నానన్నారు.