మద్యపాన వ్యసనం వల్ల కలిగె దుష్పరిణమాలపై అవగాహన..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నేడు కర్నూల్ ప్రొహిబిషన్ మరియు జిల్లా ఎక్సైజ్ కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో CARE ( కేర్ – కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్) అవగాహన కార్యక్రమంప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కర్నూలు మరియు కేర్ కమిటీ మెంబర్ అనంత ఎడ్యుకేషనల్ మరియు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు ఆల్కహాల్ అనామలీస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మద్యపాన వ్యసనం వల్ల దుష్పరిణమాలు దానివలన సమాజంలో ఎదురయ్యే సమస్యలు వ్యసన విముక్తికి గల అవకాశాలను గురించి అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ మచ్చ సుధీర్ బాబు మాట్లాడుతూ వ్యసనం నుండి విముక్తి పొందాలనీ వ్యసనపరులను ఎక్సైజ్ శాఖ డి అడిక్షన్ సెంటర్లలో చేర్పించి వారికి వ్యసన విముక్తికై అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రావిపాటి హనుమంతరావు ప్రసంగిస్తూ మద్యపాన వ్యసనం వల్ల వ్యక్తులు కుటుంబము ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక ఇబ్బందులను గురించి కూలంకషంగా ప్రసంగించారు .అదేవిధంగా ఆల్కహాల్ అనామలీస్ స్వచ్ఛంద సంస్థకు చెందిన శ్రీ జనార్దన్ వ్యసనం నుండి విముక్తి పొందే వారికి తమ సంస్థ తరఫున అందించే మద్దతు, అవకాశాలను గురించి విపులంగా ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అనంత ఎడ్యుకేషనల్ మరియు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు చెందిన శ్రీ రాజేంద్రప్రసాద్ , ఆల్కహాల్ అనమోలీస్ అనే స్వచ్ఛంద సంస్థ కు చెందిన శ్రీ. జనార్ధన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ లు శ్రీ డి రామకృష్ణారెడ్డి , రాజశేఖర్ గౌడ్ , ఎక్సైజ్ సీఐలు చంద్రహాస్ మరియు రాజేంద్రప్రసాదులు పాల్గొన్నారు.