పోలీస్.. వైద్య…న్యాయ విభాగాలకు వారది ఫోరెన్సిక్ విభాగం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : పోలీస్, వైద్య,న్యాయ విభాగాలకు మధ్య వారది లాంటిది ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సి కాలజీ విభాగం అని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ డి.ఎస్.ఎల్.వి నరసింహులు అన్నారు. కర్నూల్ మెడికల్ కాలేజీ యందు శనివారం 6వ రెండు రోజుల రాష్ట్రస్థాయి వార్షిక ఫోర్ మేడ్కాన్ 2025 కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఫోరెన్సిక్ విభాగపు అధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ సాయి సుధీర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రారంభ సమావేశంలో డి. యం.ఇ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ ఫోరెన్సిక్ విభాగంలో మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ అన్నది చాలా ముఖ్యమని ఇది మిగిలిన డిపార్ట్మెంట్ల కంటే అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ అన్నది ఒపి విభాగంలో చేర్చడానికి ప్రభుత్వానికి నివేదించామని అనుమతి లభించిన వెంటనే ఓ.పి విభాగంలో కూడా సేవలందిస్తుందన్నారు.ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను అందించగలుగు తుందన్నారు. యం.యల్.సి కేసుల్లో ఫోరెన్సిక్ విభాగం యొక్క రిపోర్టింగ్ వల్లనే అసలైన నిందితులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎంతో కఠినమైన మెడికో లీగల్ కేసుల్లో పోరెన్సిక్ విభాగము సేవలు మరువలేనివి ఆ విభాగం అందించే రిపోర్టు ల ద్వారానే నెర పరిశోధన లో వాస్తవ విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు .క్రైమ్ కేసుల్లో పోలీసు లు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నారని బయటి సమాజానికి ఇది కనిపిస్తుందని అయితే ఈ నెర పరిశోధన లో “రియల్ హీరోస్” “ఫోరెన్సిక్ విభాగపు వైద్యులేనని ” ఆయన అన్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫోరెన్సిక్ విభాగము ఎంతో అభివృద్ధి చెందిందని సాంకేతిక సదుపాయాలు కూడా ఫోరెన్సిక్ విభాగానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. సర్వజన వైద్యశాల సూపర్ండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకి ఫోరెన్సిక్ సబ్జెక్ట్ ఎంతో ఇష్టమని ఈ సబ్జెక్ట్ లొ ప్రతి విషయానికి ఒక కథతో అనుసంధానించబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ ,రిటైర్డ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డా.వీరనాగిరెడ్డి , ప్రొఫెసర్ & ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బ్రహ్మాజీ మాస్టర్,APAFMT జనరల్ సెక్రటరీ డా. సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ డాక్టర్ కే సి రంగయ్య, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మెడికల్ కళాశాల లోని ఫోరెన్సిక్ విభాగపు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్లు,పీజీలు, యూజి లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.