కళాశాల అనేది ..విలువలు నేర్చుకునే ప్రదేశం..
1 min read
రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగత మరియు వీడుకోలు కార్యక్రమం
కర్నూలు, న్యూస్ నేడు: వెంకాయపల్లి నందు ఉన్న రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులు నిర్వహించిన స్వాగత మరియు వీడుకోలు కార్యక్రమాలు మిన్నంటాయి. రెండవ మరియు తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఈ కార్యాక్రమాలని రెండు రోజుల పాటు నిర్వహించారు. ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ వేడుక ఒక సంబర వాతావరణంలో జరగింది. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డా. కే. ఈ. శ్రీనివాస మూర్తి ప్రారంభిస్తూ విద్యార్థులకు విద్యారంగంలో ఉన్న అనేక అవకాశాల గురించి వివరించారు. “ఫ్రీవర్స్ గా ప్రవేశిస్తున్న మీరు కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నారో, ఫేర్వెల్ తీసుకుంటున్న మీరైతే జీవితంలోని మరో మెట్టుపై అడుగేస్తున్నారు. మీ ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.” అని అన్నారు. కలాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కె ఉషశ్రీ మాట్లాడుతూ, “కళాశాల అనేది కేవలం విద్యా కేంద్రం మాత్రమే కాదు. విలువలు నేర్చుకునే ప్రదేశం కూడా అని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థినులు చేసిన డ్యాన్సులు మరియు గానం వేదికను కళాత్మకంగా మార్చాయి. రెండవ రోజు కర్నూలుకు చెందిన ఇండియన్ ఐడల్ యువ సంగీత కెరటం సుస్వరం అనిరుద్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. శ్రీ అనిరుద్ తమ గానామృతంతో విద్యార్థినులను అలరించడం ప్రధాన ఆకర్షణగా నిలచింది. ఇండియన్ ఐడల్ 2025 పోటీలో లో చివరి రౌండ్ వరకు కొనసాగిన శ్రీ సుస్వరం అనిరుద్ కలశాలకు రావడం పట్ల విద్యార్థినులు తమ హర్షం వ్యక్తం చేసారు.
