ఇంటర్ ఫలితాలలో రవీంద్ర కళాశాలల ప్రభంజనం
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర మరియు శ్రీకృష్ణ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో పాటు జిల్లాస్థాయి ప్రధమ స్థానమును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య , అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు రాష్ట్రస్థాయి లో ర్యాంకులు సాధించడమే కాక జిల్లా స్థాయిలో రవీంద్ర జూనియర్ కళాశాలను ప్రథమ స్థానంలో నిలిపిన కె. రాజేశ్వరి (992మార్కులు)ని ప్రత్యేకంగా అభినందించారు. మనము అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మన ఫలితాలు ఎవరికీ పోటీ కావని మనకు మనమే గట్టి పోటీ ఇస్తూ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన బాలికల జూనియర్ కళాశాలలుగా రవీంద్ర మరియు శ్రీకృష్ణ జూనియర్ కళాశాలలు నిలిచాయని పుల్లయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె.రాజేశ్వరి (992),షేక్ రుక్సానాబీ (987),షేక్ అఫ్రీన్ (985)బి.శివ మనీష (983)షేక్ హఫ్స(982)….. బైపిసి విభాగంలో బి.వెన్నెల (986) హర్సియా సుల్తానా (984) వంటి మార్కులు సాధించి ప్రథమ వరుసలో నిలిచారన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో వి. పూజిత (465) జె.సాహితీ (465)కె. హారిక (464) పి. సుహానా (464) ఎం. హాసిని (463) ఎ. పావని (463) టి.హర్షిత (463) … బైపిసి విభాగంలో షేక్ అయేషా సదాఫ్ (429) కె .అక్సా మదియా (425) కె. హిమశ్రీ (421) యన్. షాజియా (421) మార్కులతో ప్రథములుగా నిలిచారన్నారు. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను,వారి తల్లిదండ్రులను , అందుకు చక్కటి తర్ఫీదు ఇచ్చిన అధ్యాపకులను జి పుల్లయ్య తో పాటు చైర్మన్ జి వి యం.మోహన్ కుమార్ , అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ , వైస్ చైర్మన్ జి.వంశీధర్ , కళాశాలల సమన్వయకర్త డి. సురేంద్రనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి లు అభినందించారు.