చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం…
1 min read
చింతా సురేష్ బాబు జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్
కర్నూలు, న్యూస్ నేడు: వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింత సురేష్ బాబు అన్నారు. ఆదివారం కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం ఆటో స్టాండ్ సమీపాన జనసేన పార్టీ కల్లూరు మండల అధ్యక్షులు శ్రీ యాసపోగు బజారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఉమ్మడి కర్నూలు జనసేన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన కల్లూరు మండల అధ్యక్షులు బజారిని చిన్నటేకూరు గ్రామ జన సైనికులను అభినందించారు. గత 8 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ టీ మంజునాథ్ , ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు , జనసేన నాయకులు పిబివీ సుబ్బయ్య, రామచంద్రుడు, లక్ష్మన్న, హుస్సేన్, షబ్బీర్, రంగస్వామి, శివ, టి రాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.