గర్భవతులు తమ మొబైల్ లోనే రిజిస్ట్రేషన్..
1 min read
22 వరకు పోషణ పక్వాడా కార్యక్రమం..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : గర్భవతులు మూడు నెలలు అయినప్పటి నుంచి మీ మొబైల్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మిడుతూరు అంగన్ వాడీ సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ పక్వాడ కార్యక్రమం బుధవారం ప్రారంభమయ్యాయి.ఈనెల 22 వరకు అంగన్వాడి కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో కడుమూరు,మిడుతూరు గ్రామాల్లో సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామాల్లో ప్రజలు మహిళలతో కలిసి ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా కడుమూరు డాక్టర్ వ్యోమకేష్ మరియు మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ మాతృ మరణాలు,శిశు మరణాల గురించి ఏ విధమైన తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా బాగా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలనే వాటి గురించి వివరించారు.మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టి 5 సం.లు పూర్తయ్యే వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం తప్పనిసరిగా ఆ పిల్లలకు ఇవ్వాలన్నారు.బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని గురించి అవి చేయడం వల్ల వచ్చే నష్టం గురించి సిహెచ్ఓ రంగస్వామి,హెల్త్ సూపర్ వైజర్ యేసేపు అన్నారు.గర్భం దాల్చిన తర్వాత మొబైల్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వం నుండి వచ్చే వాటిని మీకు అందజేస్తామని అదేవిధంగా కేంద్రాల్లో అందించే ప్రతి ఒకటిని కూడా సక్రమంగా సూపర్వైజర్లు మహిళలతో అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు, గర్భవతులు మహిళలు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
