NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం లకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలి..ఆవాజ్

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు  ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనిడోన్ నియోజకవర్గ ము ఆవాజ్ అధ్యక్ష, కార్యదర్శులు జలదుర్గం రసూల్ , చిన్న రహిమాన్  జిల్లా నాయకుడు అక్బర్ బాష, ప్రభుత్వ మునకు విజ్ఞప్తిచేశారు. ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామములో  ఆవాజ్ కమిటీ సమావేశము శుక్రవారం నిర్వహించారు. సమావేశం లో ఆవాజ్ నాయకులు మాట్లాడుతూటిడిపి అధికారంలోకి వస్తే పేద ముస్లిం ఆడపిల్లల వివాహానికిదుల్హన్ పథకం కింద లక్షరూపాయలు,50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ 4000 రూపాయలు, 18 సం” దాటినా మహిళలకు 1500 రూపాయలు, ఇస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు అమలు చేయలేదనిముస్లింలకు వ్యక్తిగత లోన్లు ఇవ్వాలని 3సెంట్లు స్థలము ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాలని వారు కోరారు.పేద ఆడపిల్లల తల్లితండ్రులు ప్రభుత్వం దుల్హన్ పథకం అమలు చేస్తుందని నమ్మకం తో, అప్పులు చేసి వివాహాలుచేశారని, ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు దుల్హన్ పథకం అమలు చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ హుస్సేన్ వలి, దస్తగిరి, గుండాల్ బాష, సలీం బాష, మహమ్మద్, మాబు, మాసుం వలి, అహమ్మద్ బాష, పెద్ద బషీర్ తో పాటు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

About Author