హోమ్ అఫ్ హోమ్ అనాధ ఆశ్రమం తనిఖీ చేసిన న్యాయమూర్తి
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి , మరియు ఎల్సమ్ కమిటీ సభ్యులైన శివరాం, డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్, రాయపాటి శ్రీనివాసులు, పారా లీగల్ వాలంటీర్ లు కలసి బుధవారం నాడు కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్ సైడ్ నందు గల హోమ్ అఫ్ హోమ్ అనాధ ఆశ్రమాన్ని తనిఖీ చేయడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో తనిఖీ చేపట్టారు. ఆశ్రమంలోనీ నిరాశ్రయులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనాధ ఆశ్రమంలోని రికార్డులును అలాగే పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వారికీ అందుతున్న ఆహార, వైద్య సదుపాయల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికీ న్యాయ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసారు.