పొగాకు ట్రాక్టర్ బోల్తా..తప్పిన ప్రమాదం
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు :నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో పెను ప్రమాదం తప్పింది.చౌటుకూరు గ్రామానికి చెందిన గోపాల్ మిడుతూరులో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు.ఆ పొలంలో చుక్కబర్రి పొగాకు పంటను వేశాడు.మిడుతూరు నుండి పొగాకును ట్రాక్టర్(ఏపీ 39 ఎస్ హెచ్ 9182)లో శనివారం ఉ 11 గంటలకు చింతలపల్లి గ్రామంలో ఉన్న మలుపు దగ్గర ట్రాక్టర్ ట్యాలీ అదుపుతప్పి బోల్తా పడింది.ట్రాక్టర్ పై ఉన్న పొగాకు క్రింద పడింది.ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.