NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడల సాధనకు ప్రోత్సహించాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: క్రీడల సాధనకు ప్రోత్సహించాలని అన్నారు  విఆర్ మల్టీ హాస్పిటల్ అధినేత సి వాసు రెడ్డి.స్థానిక .జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం  టైక్వాండో పోటీలలో నిర్వహించారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోటీలు ప్రారంభం చేశారు సి వాసిరెడ్డి మాట్లాడుతూ ఒలంపిక్ డే ఉత్సవాలలో భాగంగా  టైక్వాండో క్రీడాకారు లు రాణిస్తున్నారు పోటీలలో పథకాలు సాధించేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భవిష్యత్తులో టైక్వాండో  పోటీల లో పాల్గొని క్రీడాకారులకు తన వంతు ఆర్థిక సహాయ అందజేస్తారని తెలియజేయడం జరిగింది.  నగురూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మాజీ మార్కెట్ చైర్పర్సన్ ఎన్ శమంతకమణి మాట్లాడుతూ టైక్వాండో ఒలంపిక్ క్రీడా స్పోర్ట్స్ కోట మూడు శాతం ఉందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సర్వోత్తమ్ ఒలంపిక్ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు హాకీ సుధీర్ హర్షవర్ధన్ వేణుగోపాల్ దాదాభాష జూడో కోచ్ కె ఎం డి షకీల్ కోచ్ టి అజయ్ టి తేజ  రోహిత్  హుస్సేన్ (టైక్వాండో కర్నూలు జిల్లా అసోసియేషన్) కార్యదర్శి టి వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.

About Author