పెదపాడు శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
పర్యవేక్షించిన గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జానుబాబు
మాయ విసనకర్ర పుస్తకం నుండి విద్యార్థులకు నిజాయితీ-మార్పు నీతి కథ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్ కుమార్ చే డీ.కె చదువుల బాబు రచించిన”మాయ విసనకర్ర”అనే పుస్తకం నుండి”నిజాయితీ-మార్పు” అనే నీతి కథను విద్యార్థులచే చదివించడం, కథలు చెప్పించడం, పుస్తక సమీక్ష చేయించడం జరిగినది. అనంతరం రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్ చే”సర్దార్ వల్లభాయ్ పటేల్” జీవిత చరిత్రను విపులంగా తెలియపరచి ఈయన ది: 31/10/1875న గుజరాత్ లోని నాడియర్ లో జన్మించినారు.ఈయన ప్రముఖ స్వాతంత్ర యోధుడుగానే కాకుండా స్వాతంత్రం అనంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారు.రాజ్యాంగ రచన లో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా వ్యవహరించారు. స్వాతంత్రం అనంతరం జవహర్లాల్ నెహ్రు నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలిలో హోం శాఖ మంత్రి గాను,భారత ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. అని తెలియజేసినారు. అనంతరం బాల,బాలికలతో ఇండోర్ గేమ్స్ “క్యారమ్స్, చెస్” ఆటలు నేర్పించి ఆడించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు 10 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనినారు. ఈ కార్యక్రమన్ని గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మంచినీరు, స్నాక్స్ అందించడం జరిగింది.