తల్లి దండ్రులు పిల్లలపై వేసవి సలవులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
1 min read
ఎటువంటి హాని జరగకుండా బాధ్యతాయుతంగా ఉండాలని విజ్ఞప్తి
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవలే జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.వేసవి సెలవులు నేపథ్యం లో విహార యాత్రలకు అలాగే పలు ప్రాంతాలు సందర్శనలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకొని వారి కదలికలను గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ఇటీవలే జిల్లా వ్యాప్తంగా వేరు వేరు సంఘటనలలో నిర్లక్ష్యం గా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 మంది కి చేరడం బాధాకరం అని,ముందస్తుగా వారిపట్ల బాధ్యతగా వ్యవహరించి ఉంటె ప్రాణ నష్టం తీవ్రత తగ్గేదని,కొన్ని రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలం దొరమామిడి అలివేరు ప్రాజెక్టు లో ప్రమాదవుసాత్తు ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆయన్ని కలచి వేసిందని అన్నారు. ముందుగానే మెలుకువగా ఉండి పిల్లలు కదలికలు గమనించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రతి తల్లి దండ్రలకు విజ్ఞప్తి చేశారు.