పార్టీ తమ కార్యకర్తల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తుంది
1 min read
: మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని సుందర్ సింగ్ కాలనీలో నివసించే షేక్ ఖాజా బాషా విద్యుత్ షాక్‌తో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై, ఆయన కుటుంబానికి పార్టీ తరఫున ఆర్థిక సాయం అందింది. డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పార్టీ సభ్యత్వంగా తీసుకున్న రూ.100 భీమా పథకం ద్వారా లభించిన రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ పత్రాన్ని కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా సుజాతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ,”ఈ సాయం మీ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరటనిచ్చి, ధైర్యంగా జీవితం కొనసాగించేందుకు ఉపయుక్తపడుతుంది” అని తెలిపారు. పార్టీ తమ కార్యకర్తల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తుందని పేర్కొంటూ, “తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది” అని హామీ ఇచ్చారు.ఈ సహాయం టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా అందించబడింది, ఇది పార్టీ కార్యకర్తల భద్రత కోసం తీసుకున్న ఓ మానవీయ చర్య అని సుజాతమ్మ తెలిపారు.