ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి
1 min read
ఆర్ యు ఎస్ ఎఫ్. ఆర్ పి ఎస్ ఎఫ్.
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఈరోజు. ఆర్ యు ఎస్ ఎఫ్. ఆర్ పి ఎస్ ఎఫ్. ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ పి ఎస్ ఎఫ్. రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రిది. ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులు డొనేషన్లు అమాయకులైనటువంటి తల్లిదండ్రుల దగ్గర నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థి తల్లిదండ్రులని మోసం చేయడం జరుగుతుంది అదేవిధంగా పాఠశాలల్లో ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినా ఫీజులు మాత్రం బీభత్సంగా పెంచడం జరుగుతుంది సామాన్య పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మిగనూరులో నెలకొంది విద్యార్థులు తల్లిదండ్రులకు అడ్మిషన్లు చేయించుకునే ముందు కల్లబొల్లి మాటలు చెప్పి తరువాత బుక్స్ ఫీజ్ అని పరీక్షల ఫీజు అని ఇతర ఫీజులతో కలిపి తల్లిదండ్రులను ముక్కు పిండి వసూలు చేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా భాష్యం నారాయణ శ్రీ చైతన్య లిటిల్ రవీంద్ర భారతి విద్యా నికేతన్ ఫ్లవర్ మాచాని బ్లాజం కిడ్స్ కస్తూరి వివిధ పాఠశాలలు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కావున జిల్లా విద్యాధికారులు స్పందించి విద్యార్థి తల్లిదండ్రులను పీడిస్తున్నటువంటి పాఠశాలలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలుగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ప్రభాకర్ రంగన్న అనీలు నాయకులు పాల్గొన్నారు.