వైద్య సేవలు పొందేందుకు.. ఆధార్ కార్డు తప్పనిసరి
1 min read
కడుమూరు వైద్యులు రాజు, వ్యోమకేష్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు తీసుకొని రావాలని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పి రాజు,వ్యోమకేష్ అన్నారు.శనివారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో జరిగిన సమావేశంలో డాక్టర్లు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు(ఈహెచ్ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డు)ద్వారా ప్రతి వ్యక్తికి 12 అంకెలు గల నెంబర్ వస్తుందని వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అనారోగ్యం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు తమ ఆధార్ కార్డుకు లింకు అయిన మొబైల్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఆస్పత్రిలో మీ ఆధార్ నంబర్ నమోదు చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్ కు ఓటిపి వస్తుందని ఈ ఓటిపి నంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుందని వీటిని ప్రజలు గమనించాలని అన్నారు. ఆరోగ్య సిబ్బంది కూడా గ్రామాల్లో వీటిపై అవగాహన కల్పించాలని సిబ్బందికి డాక్టర్లు సూచించారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ రంగస్వామి,హెల్త్ సూపర్వైజర్లు ఏసేపు,రామతులశమ్మ,స్టాఫ్ నర్సులు సౌజన్య,రాధా,జ్యోషి రాజ్ పాల్గొన్నారు.