పెద్దటేకూరులో.. శానిటేషన్ తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి శ్రీ జి భాస్కర్ వారు పెద్దటేకూరు గ్రామంలోని పలు వీధుల యందు శానిటేషన్ తనిఖీ చేయడం మరియు ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా మోడల్ విలేజ్ గా పెద్దటేకూరు గ్రామం ఎంపికైనందున, గ్రామం నందు ఈరోజు నుండి మూడు రోజుల వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టి గ్రామాన్ని వ్యర్ధరహిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టవలసినదిగా డిప్యూటీ ఎంపీడీవో కల్లూరు వారికి మరియు పంచాయతీ కార్యదర్శికి సూచనలు ఇవ్వడం జరిగినది, ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రామ సర్పంచ్ మరియు డిపిఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.