NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటుసార తయారీ దారులపై దాడులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నవోదయం 2.0 లో భాగంగా నాటుసార తయారీ దారులపై దాడులు నిర్వహించడమైనది. కల్లూరు మండలం కొల్లంపల్లి తండా లో దాడులు నిర్వహించి సుమారు 1325 లీటర్ల నాటు సారాకు ఉపయోగపడు బెల్లం ఊటను ధ్వంసం చేయడమైనది. తదుపరి విచారణలో సదరు నాటు సారాకు ఉపయోగపడు బెల్లం ఊట ఎవరిది అని తగు విచారణ తర్వాత కేసు నమోదు చేయడం జరుగుతుంది కావున నాటు సారా తయారు చేయడం మరియు అమ్మడం రవాణా చేయడం నేరమని తెలియజేయుచున్నాము ఇకమీదట ప్రతినిత్యం దాడులు నిర్వహిస్తూ ఎవరైతే క్రమానుగతంగా నాటు సారాను తయారు చేస్తారో అటువంటి వారిపై తీవ్రమైన కేసులు పదేపదే పెట్టడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము. కావున నాటసార తయారీదారులు అందరూ నాటు సారాను పూర్తిగా మానివేసి ఇతర వృత్తులలో కొనసాగవలెనని తెలియజేయుచున్నాము. తదుపరి చెన్నమ్మ సర్కిల్ వద్ద దాడులు నిర్వహించగా సుమారు 46 మద్యం బాటిల్ ను మరియు ముగ్గురు మగ వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి  46 మద్యం బాటిల్లను  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైనది ఈ కార్యక్రమం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆర్ హనుమంతరావు  ఆదేశముల మేరకు పైన తెలిపిన ప్రదేశాలలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడమైనది. ఈ దాడులలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కృష్ణఎన్ ఫోర్స్ మెంట్  రాజేంద్రప్రసాద్ ఈ ఎస్ టి ఎఫ్,  రెహానా, నవీన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కర్నూలు   మరియు సిబ్బంది ఈరన్న రామలింగ చంద్రపాల్ పాల్గొన్నారు.

About Author