తెలుగువారి ఖ్యాతిని చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఎన్టీఆర్
1 min read

రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహోన్నత వ్యక్తి
కలెక్టరేట్ లో ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల,న్యూస్ నేడు: తెలుగువారి ఖ్యాతిని దేశ నలుమూల చాటి చెప్పిన గొప్ప మహనీయ వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని దేశ నలుమూల వ్యాప్తి చేయడానికి నందమూరి తారక రామారావు గఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారని ఇప్పటికీ కూడా మేజర్ చంద్రకాంత్, మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాలు అందరి మనస్సుల్లో చిరస్థాయిగా గుర్తు ఉండిపోయాన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నుండి సమయపాలన, మంచితనం, ఇచ్చిన మాటను తప్పకపోవడం లాంటి సుగుణాలు వారిలో ఎన్నో ఉన్నాయని…వాటిని యువత స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితాలకు అన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ప్రజల శ్రేయస్సు కోసం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.కోస్తా జిల్లాలకు ధీటుగా రాయలసీమ జిల్లాలు ముందుండాలన్న ఆలోచనతో జిల్లాలో పోతిరెడ్డిపాడు, బనకచర్ల ప్రాజెక్టులను నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు అవిరళ కృషి చేశారని కలెక్టర్ తెలిపారు.జిల్లా సస్యశ్యామలంగా ఉండే విధంగా అప్పట్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ స్థూల దేశీయోత్పత్తి పెంచడానికి ఎంతో దోహద పడిందన్న విషయాలను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి వారల నుండి తెలుసుకోవడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. జిల్లాకు కలెక్టర్ గా వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉదయాన్నే అధికారులకు ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి పలు అంశాలపై ఆరా తీసేవారని, ప్రతి వారం సంబంధిత మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీలను ఇంటికి ఆహ్వానించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేవారని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా ఎన్టీఆర్ నాయకత్వాన్ని కొనసాగిస్తూ వారి సంతతి రాజకీయ, నటన పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. నందమూరి తారక రామారావు పిల్లల నుండి పెద్దల వరకు ఆప్యాయంగా, ఆత్మీయతతో పలకరించేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు కి జయంతి వేడుకలకు విచ్చేసిన వారందరికీ కలెక్టర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.అంతకుముందు సురవ శరణ్యత సంఘం అధ్యక్షుడు గెలివి సహదేవుడు, శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు నందమూరి తారకరామారావు గురించి పలు అంశాలను ప్రస్తావించారు.అనంతరం బాల్ భవన్ విద్యార్థినిలు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్థినిలకు జాయింట్ కలెక్టర్ బహుమతి ప్రధానం చేశారు.

