ఆదివాసుల అస్తిత్వాన్ని కాపాడుకుందాం …ఏ ఐ కె ఎమ్ ఎస్
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: ప్రపంచ ఆదివాసి దినం సందర్భంగా అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో వెలుగోడు చెంచు కాలనీలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి అఖిలభారతా రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు మాట్లాడుతూ భారత సమాజంలో నోటికి 9% గా ఉన్న ఆదివాసీల సంఖ్య రిత్య సుమారు 13 కోట్ల మంది ఉన్నారు ఆదివాసుల అభివృద్ధి లేకుండా ఆనాదిగా అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగి అడవుల్లోనే జీవిస్తున్నారు .నాగరిక ప్రపంచానికి దూరంగా కొండ కోనల్లో ప్రత్యేక భాష .సంస్కృతి. వేషధారణ కలిగిన ఆదివాసుల వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు .ఆదివాసి చెంచు గిరిజన ప్రాంతాల్లో నేటికీ మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు విద్య వైద్య సదుపాయాలు లేవు రోగం వచ్చిన రోప్పులొచ్చిన ఆదివాసులు డోలీలు కట్టుకొని సుదూర ప్రాంతాల నడిచి ఆసుపత్రులకు రావాల్సిన దుస్థితి నేటికీ కొనసాగుతుంది. అనారోగ్యాల వలన ఆదివాసులు సగటు జీవితం 45 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. ఆదివాసి ప్రాంతాల్లో ప్రజలు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనధారంగా ఉంది అందుకే ఆదివాసి చెంచు గిరిజనులు సాగు చేసుకుంటున్న పౌడు భూమికి పట్టాలు ఇవ్వాలి ఆదివాసుల మనుగడను ప్రశ్నార్ధకంగా చేస్తున్న అటవీ సవరణ చట్టాన్ని ఎత్తివేయాలి 2023 అటవీ సంరక్షణ నియమాలకు వ్యతిరేకంగా ఆదివాసి అమరులు చూపిన బాటలో పోరాటాలు నిర్వహించాలి ప్రతిఘటన పోరాటాల మాత్రమే ఆదివాసులు జీవించే హక్కును కాపాడుతాయని ఆయన తెలిపారు .వెలుగోడు ప్రాంతంలోని పెద్ద పుల్లమ్మ చెరువు తూములను తెరవాలి .చెరువు కింద ఉన్నటువంటి పోడు భూములను చెంచులకు పంచాలి .వేంపెంట దగ్గర ఉన్న చెంచులకు ఇచ్చిన భూములను ఆన్లైన్లో ఎక్కించాలి .తదితర చెంచు సమస్యల పరిష్కారం కొరకు అఖిల భారత రైతు కూలీ సంఘం అండగా ఉంటుందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ .అఖిల భారత రైతు కూలి సంఘం మండల నాయకులు లాలు నాయక్ .కృష్ణ .మరియు చెంచులు భూదేవి . భూమన గొలుసన్న .ఈరమ్మ. తోట ఈదన్న .లింగమ్మ .అంకన్న తదితరులు పాల్గొన్నారు.