NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి

1 min read

ఆస్తి కోసం తల్లికి  చెల్లికి వెన్నుపోటు

యువత మెగా డీఎస్సీ అంటూ వెన్నుపోటు

బాబాయి కి గొడ్డలి పోటు ,,,

మహిళలకు మద్యం లేకుండా చేస్తానని  వెన్నుపోటు ,,,

పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితా రెడ్డి .

పాణ్యం నియోజకవర్గంకల్లూరు చెన్నమ్మ సర్కిల్

కర్నూలు, న్యూస్​ నేడు:  వెన్నుపోటు కు కేరాఫ్ అడ్రస్ పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డిపాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి   తెలియజేశారు.బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ లో  టీడీపీ శ్రేణులతో నిరసన వ్యక్తం చేస్తూ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చరిత రెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటు అంటే జగన్ రెడ్డి కి అన్ని హక్కులు ఉన్నాయని,ఎందుకంటే ఆస్తి కోసం తల్లి, చెల్లి నీ కోర్టు కు ఈడ్చి వెన్నుపోటు పొడవడం,సొంత బిడ్డల చూసుకున్న బాబాయ్ కి గొడ్డలి పోటు తో వెన్నుపోటు పొడవడం,తన స్వార్థం కోసం తనను నమ్ముకున్న వాళ్ళని,అధికారులను జైలు కు పంపేలా అవినీతి తో వెన్నుపోటు పొడవడం,అధికారం కోసం నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడం,మధ్య నిషేధం అంటూ మహిళలకు వెన్ను పోటు పొడిచి మద్యం ద్వారా వేల కోట్లు అవినీతి చెయ్యడం,నమ్మి ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి అన్న,ఇలా ఒకటి ఏమిటి నమ్ముకున్న నాయకులను,కుటుంబ సభ్యులను,అధికారులను అందరిని వెన్ను పోటు పొడిచి ఐదేళ్లు అధికారం అనుభవించి వెన్నుపోటు ను గుర్తించిన ప్రజల చేతుల్లో ఘోర పలితాలు రుచి చూసి ,నేడు ప్రజా పాలనను ఎదుర్కోలేక వెన్నుపోటు అంటూ వెన్ను పోటు బ్రాండ్ అంబాసిడర్ డ్రామా చెయ్యడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనీ ఎద్దేవ చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ , నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ,కల్లూరు అర్బన్ నాయకులు, కార్యకర్తలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author