వి.హెచ్.పీ.మాతృశక్తి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పవిత్ర శ్రావణమాసం సందర్భంగా హిందు స్త్రీ లకు , ముత్తైదువులకు పండుగల మాసం… శ్రావణమాసం రెండవ శుక్రవారం అనగానే మత్తైదువులందరూ భక్తి శ్రద్ధలతో , ధన,ధాన్యాలతో…పసుపు కుంకుమలతో చిరకాలం వర్దిల్లేలా చూడాలని ఆ శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారని వ్రతం నిర్వాహకురాలైన విశ్వ హిందూ పరిషత్ జిల్లా మాతృశక్తి కో కన్వీనర్ శ్రీమతి మాళిగి పావని తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా మాతృ శక్తి విభాగం ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖంఢ లోని శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం, హరిశ్చంద్ర శరీన్ నగర్ లో సా : 6:00 గం.లకు “సామూహిక వరలక్ష్మీ వ్రతం”నిర్వహించారు.ముందుగా ఆ శ్రీమహాలక్ష్మికి షోఢశోపచార పూజలు నిర్వహించి , హాజరైన స్త్రీ లందరి చేత 108 సార్లు ఆ శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ కుంకుమార్చన , 108 తామర పువ్వులతో అర్చన తో మహాలక్ష్మి ని వైభవంగా పూజించి, అనంతరం వరలక్ష్మీ దేవి కథా శ్రవణం చేసి…. 16 రకముల పై వేద్యాలను సమర్పణ చేసి వచ్చిన భక్తులందరికీ తీర్థ, ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో….. మహాలక్ష్మి, పరమేశ్వరి,ఉమ, పుష్ప, జయ్యమ్మ, వనజ, మమతా, పావని, పూజిత, కవిత, అశ్విని, రాధ, లావణ్య, హేమలత,సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.