NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య కుటుంబానికి అండగా ఉంటాం

1 min read

మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం న్యూస్​ నేడు :  వైకాపా నాయకుల దాడి లో గాయపడిన మాజీ జడ్పీటీసీ సభ్యులు మాలపల్లి లక్ష్మయ్య కుటుంబానికి అండగా ఉంటామని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో లక్ష్మయ్య నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో లేనప్పుటికి  వైసీపీ గుండాల లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇలాంటి వారి ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమలు వల్ల ప్రభుత్వం పై పెరుగుతున్న ఆదరణ ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసిపి గుండాలు కులాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ అనుచరుల మీద ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి విరుచుకుపడ్డారు అన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి,ప్రజలను మభ్యపెట్టి ఉన్న వనరులను దోచుకోవడం, ఘర్షణలు పన్ని తమ స్వార్థపూరిత జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో టీడీపీ  నాయకులు పల్లెపాడు రామిరెడ్డి  నాయకులు పాల్గొన్నారు.

About Author