వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా రవీంద్రుడు
1 min readనియోజకవర్గ ఇన్చార్జిగా నరేన్ రెడ్డిని సన్మానించిన
వైఎస్ఆర్సిపి నాయకురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ
వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా పోచమరెడ్డి నరేన్ రామాంజులరెడ్డిని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల ఆ పార్టీ మండల నాయకురాలు దాదిరెడ్డి భాగ్యమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకాలను ఆమె కడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డికి, కమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పోచమ రెడ్డి నరేన్ రామాంజనేయ రెడ్డికి పుష్ప గుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించినట్లు ఆమె తెలిపారు, ఈ సందర్భంగా ఆమె చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియామకాలతో నూతన ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అయిందని ఇది పార్టీ శ్రేణులకు ఒకింత ఉత్సాహం కలిగించే అంశమని ఆమె తెలియజేశారు. కమలాపురం నియోజకవర్గంలో యువ నాయకులు నరేన్ రామాంజుల రెడ్డి నేతృత్వంలో పార్టీ బలోపేత దిశగా సాగుతుందని, వైయస్సార్ సిపి లో ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి ఆయన భరోసానివ్వడమే కాకుండా, అందరికీ అండదండగా ఉంటూ పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. రాబోవు రోజుల్లో పార్టీ బలోపేతం కావడమే కాకుండా, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మేలు జరిగే విధంగా యువ నాయకులు నరేన్ రెడ్డి తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు మరింత ముందుకు వెళ్లడం జరుగుతుందని పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు.