NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భాజపా నేతృత్వంలో ప్రధాని నాయకత్వంలో దేశంలో సుపరిపాలన 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు : భాజపా నే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన భారతదేశం సుపరిపాలనతో వర్ధిల్లుతుందని బిజెపి అసెంబ్లీ కోకన్వీనర్ గోవర్ధన్ నాయుడు, బిజెపి మండల అధ్యక్షులు కరణం నరేష్ కొనియాడారు. భాజపా నేతృతంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ  11 సంవత్సరాల అవినీతి రహిత, ప్రజోపయోగకర పాలనను పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు బుధవారం పత్తికొండ బిజెపి ప్రాంతీయ కార్యాలయంలో బీజేపీ మండల స్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ కరణం నరేష్  అధ్యక్షతన, అసెంబ్లీ కోకన్వీనర్ శ్రీ గోవర్ధన్ నాయుడు సమన్వయంతో నిర్వహించబడింది. ముఖ్య వక్తగా హాజరైన ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రామాంజనేయులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుండి భారీ నిధులు విడుదలైనట్లు తెలియజేశారు.ప్రధానమంత్రి మోదీ  నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అవినీతి లేని పాలన కొనసాగుతుండడం భాజపా సిద్ధాంత పరమైన నాయకత్వానికి నిదర్శనం.భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం అని అన్నారు.ముఖ్యంగా కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయడానికి వేల కోట్ల రూపాయల కేటాయింపులు కేంద్రం నుంచి జరిగాయని తెలిపారు.ఉజ్వల యోజన, జన్ ధన్, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, హర ఘర్ జల్ వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిని అందించిందన్నారు.ఈ ఫలితాలను ప్రజలకు తెలియజేయడం బీజేపీ కార్యకర్తల బాధ్యతగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు.

About Author