ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
1 min readడిపో గేటు ఎదుట నల్ల బ్యాడ్జిల్ ధరించి నిరసన
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : పట్టణంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు స్థానిక ఎమ్మిగనూరు డిపో గేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నాడు గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నైట్రోట్ అలవెన్సు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు నిలిపివేత పై ఆందోళన చేస్తున్నట్లు ఎమ్మిగనూరు డిపో నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తెలిపారు. నైట్ అవుట్ అలవెంచులు వేతనంతో కలిపి చెల్లించడానికి అధికారుల నిరాకరణ ఎందుకని ప్రశ్నించారు. ట్రెజరీలో మాడ్యూల్ కష్టాల వల్లే నైట్ ఓట్లు కలపలేమంటున్న ట్రెజరీ ఉన్నత అధికారులకు మ్యాడ్వల్ సమస్యలను పరిష్కరిస్తే వివాదానికి స్థిరపడుతుంది కానీ ఇలా ఉద్యోగుల నైట్ ఓటు అలవెంచులను ఆపివేస్తే ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు ఆందోళన లు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ట్రెజరీ శాఖ గ్రహించి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ హోటల్ వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ విషయానికి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ట్రెజరీ అధికారులే కానీ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి ఉద్యోగులు ట్రెజరీ దగ్గర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగి వారి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న క్షేత్రస్థాయిలో ట్రెజరీ అధికారులు ఆ పని చేయలేకపోతున్నారని ట్రెజరీ మాటివల్ను మారిస్తేనే అది సాధ్యమవుతుందని చెబుతున్నారే తప్ప అది మార్చే ప్రయత్నం చేయడం లేదని విలీన సమయంలో క్రిందటి వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిందని కొన్నింటిని ఉద్యోగులు పోరాడి సాధించుకున్నారని కానీ వాటి అమలు విషయంలో సమస్యలు తలనొత్తుతున్నాయని నైటు అలవెన్స్ సమస్య కూడా అలాంటి వాటిలో ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. కండక్టర్ డ్రైవర్లకు నైటు ఔట్ అలవెంచులను వెంటనే జీతంలోనే చెల్లించాలని, 2022 మరియు 2023 సంవత్సరపు లీవ్ ఎన్కాష్మెంట్ ను వెంటనే చెల్లించాలని, రిటైర్డ్ అయిన వారి రావలసిన లీవుల డబ్బులను ఇతరములను వెంటనే చెల్లించాలని, మెడికల్ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, చనిపోయిన కార్మికుల దహన సంస్కారం క్రింద 25 వేలు వెంటనే ట్రెజరీ ద్వారా ఇవ్వాలని, నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు ఈరోజు ఉదయం మొదటి బస్సు బయలుదేరు సమయము నుండే నల్ల బ్యాడ్జీలతో మరియు 11 గంటలకు గేట్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్ర నాయకుల సలహా మేరకు ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సహాయ కార్యదర్శి కె. ఎం. సాహెబ్ ట్రెజరీ ఉన్నతాధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రెటరీ ఎంఎండి షరీఫ్, సురేష్ బాబు, వై ఆర్ చంద్ర, డి.య్యం .భాష, డి ఎస్ ఎస్ వలి, ఎస్ వి భాష, నాగేంద్ర, ఖాసిం, యు బి లక్ష్మన్న, వెంకన్న, ఖాజావలి, ఎస్. బి.నవాజ్, ఎల్. బి. నవాజ్, గ్యారేజీ కార్యదర్శి భాస్కర్ సహాయ కార్యదర్శి ఓంకార్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.