పోరాట యోధుడు… నవాంధ్ర నిర్మాత చంద్రబాబు
1 min readచంద్రబాబు నిత్య కృషివలుడు
చంద్రబాబు విధానాలు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి : మంత్రి టీజీ భరత్
చంద్రబాబు నేటి తరానికి దర్శనికులు
చంద్రబాబు వేసే ప్రతి అడుగు భావితరాల కోసమే : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ పేరులా చంద్రబాబు పేరు కూడా నిలిచిపోతుంది
అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : ఎమ్మెల్సీ ఆశోక్ బాబు
పల్లెవెలుగు వెబ్ అమరావతి: సెప్టెంబర్ 1 నాటికి చంద్రబాబు మొదటి సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సామాజానికి చంద్రబాబు చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరగనున్నాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలియజేశారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిశ్రమలు, వాణిజ్య, పుడ్ ప్రోసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ ఆశోక్ బాబు, టీడీపీ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ…‘‘సెప్టెంబర్ 1 నాటికి చంద్రబాబు మొదటి సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు గడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చంద్రబాబు లాంటి నాయకుడు మనకి దోరకడం అదృష్టం. చంద్రబాబు ముందుచూపునకు ఎవరూ సాటి రాలేరు. 1999లో సీఎంగా చంద్రబాబు ఎన్నికైన తరువాత ప్రతి ఒక్కరూ ఆయనను సీఈఓ అఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కితాబుచ్చేవారు. ఈ గుర్తింపు అంతా సులభంగా, త్వరగా వచ్చేది కాదు, దాని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంటేనే వస్తుంది. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఉంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఇంకో విధంగా ఉండేది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని చోట్ల ఆరాచక పాలన సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతుంది. సూపర్ సిక్స్ ను సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకే సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అన్న క్యాంటీన్లు మళ్లీ అందుబాటులోకి రావడం ప్రతి పేదవాడి కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఫించన్ ను సైతం రూ.4000కు ఒకటో తేదీనే అందేవిధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేసేందుకే నిత్యం ఆలోచిస్తారు. అందుకే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ గా మార్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు చేసిందేమీ లేదు. అందుకే వారికి 11 సీట్లతో కూడిన క్రికెట్ టీంను ప్రజలు అందించారు. ఏది కూడా అనుకున్న వెంటనే అయిపోదు.. సమయం పడుతుంది. గ్రీవెన్స్ ను నాయకులందరూ సీరియస్ గా తీసుకోవాలి.. సమస్య అంటూ వచ్చిన వారికి పరిష్కరం చూపించాలి’’ అని అన్నారు.
చంద్రబాబు నేటి తరానికి దర్శనికులు: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
‘‘చంద్రబాబు నేటి తరానికి దర్శనికులు.. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా తెలుగు జాతి ఐక్యత, ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలో బిడ్డలందరూ దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్న ముందు వరుసలో ఉన్నారంటే అది చంద్రబాబు ముందుచూపుతోనే సాధ్యమైంది. విభజన తరువాత ఎంతో సమస్యలతో మొదలైన నవ్యాంధ్రకు సమస్యలను అధిగమించే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ నవరత్నాల పేరు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లిపోయారు. రాష్ట్ర రాజధాని అమరావతిని పక్కన పెట్టేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. చంద్రబాబు తీసుకున్న ప్రతి అడుగు భావితరాలకు మంచి భవిష్యత్తును ఇచ్చేందే.
చంద్రబాబు పేరు చరిత్రలో నిలిచిపోతుంది: ఎమ్మెల్సీ ఆశోక్ బాబు
‘‘భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ పేరులా.. చంద్రబాబు పేరు కూడా సువర్ణ అక్షరాలతో నిలుస్తుంది. చంద్రబాబు సహనం, కష్టపడే మనసత్వం, విజన్ లతో రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్నారు. 1995-99 మధ్యకాలంలో చంద్రబాబు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణకు మంచి ఫలాలను అందిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురు వచ్చిన అత్మవిశ్వాసంతో నిలబడటం చంద్రబాబు నైజం. కష్టాలను అవకాశాలుగా మలుచుకోని విజయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారు. 2019 ఎన్నికల్లో జగన్ ను గెలిపించి తప్పుచేశామని తెలుసుకుని 2024 ప్రజా తీర్పుకు కారణం చంద్రబాబుపై నమ్మకం. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఉంటే ఆంధ్ర రాష్ట్ర స్థాయి ఎక్కడో ఉండేది. వైసీపీ గెలిచి రాష్ట్రంలో ఈ వ్యవస్థ నాశానం కాలేదని చెప్పగలిగేది ఏదైనా ఉందంటే అది కేవలం జగన్ రెడ్డి టీం మాత్రమే. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. చంద్రబాబు జీవితాంతం ముఖ్యమంత్రిగానే కొనసాగాలి’’ అని అన్నారు. చంద్రబాబు రాష్ట్రశ్రేయస్సు కోసమే పని చేస్తారు: టీడీపీ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు‘‘చంద్రబాబు మొదటి సారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు గడిచాయి. ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసమే పని చేస్తారు. రాష్ట్రం కోసం విజన్ తో పని చేశారు. అవిశ్రాంతంగా పని చేస్తు తెలుగు వారిని అగ్రస్థానానికి తీసుకువెళ్లడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. విజన్ – 2020 ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో మాటలు అన్నారని, వారికి సమాధానంగా నేడు హైదరాబాద్ అభివృద్ధి కనిపిస్తుంది’’ అని గుర్తుచేశారు.