PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వర్షాల కారణంగా తలెత్తే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి: డీపీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తలెత్తే సమస్యల పట్ల పంచాయతీ కార్యదర్శులు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజ నాయుడు ఆదేశించారు. వర్షాల కారణంగా మురుగు కాలువలు పొంగి పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశాన్ని నివారించాలని అన్నారు. అదేవిధంగా తాగునీటి పైపులైన్లు లీకేజీల ద్వారా  కలుషితం కాకుండా తక్షణమే మరమ్మత్తు పనులు చేయించాలని సూచించారు. ట్యాంకులు నింపిన ప్రతిసారి క్లోరినేషన్ చేపట్టాలని, అవసరమైతే సూపర్ క్లోరినేషన్ కూడా చేయించాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తాగునీటిని వేడి చేసి చల్లార్చి తాగేలా అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో తరచుగా ఫాగింగ్ చేపట్టి దోమల ద్వారా ప్రబలే వ్యాధులను అరికట్టాలని ఆయన ఆదేశించారు. కరెంటు సమస్య కారణంగా తాగునీటికి ఇబ్బంది కలగకుండా వీలైన చోట జనరేటర్ సదుపాయాన్ని సమకూర్చుకోవాలని తెలిపారు. ఆపత్కాల పరిస్థితులలో ప్రజలకు సేవలందించేందుకుగాను గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బంది మొబైల్ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు.

About Author