కోటా పాఠశాలలో వన మహోత్సవం..
1 min readప్రతి ఒక్కరూ ఒక చెట్టు మొక్క నాటాలి:హెచ్ఎం సలీం బాష..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రతి ఒక్కరూ ఒక చెట్టు మొక్కను నాటాలని ప్రధానోపాధ్యాయులు సలీం బాష అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో శనివారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కోట) ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి చెట్లను నాటారు.నంద్యాల డీఈవో సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమాన్ని పాఠశాల ఫిజికల్ డైరక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా హెచ్ఎం సలీం భాష మాట్లాడుతూ వన సంరక్షణ-మన సంరక్షణ అని చెట్ల పెంపకం వలన అడవుల వలన వర్షపాతం అధికం అవుతుందని తద్వారా సాగు నీటికి తాగు నీటికి ఇబ్బందులు ఉండవని పశు,పక్ష్యాదులు నీటి కొరత లేకుండా ఉంటాయని కావునా సమాజం పట్ల బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపు ఇచ్చారు.అనంతరం పాఠశాల “నేషనల్ గ్రీన్ కార్ప్స్”(యన్.జీ.సి)టీం మరియు సైన్సు ఉపాద్యాయులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.ఈ మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హెచ్ఎం అన్నారు.మొక్కలకు సహకరించిన మున్సిపాలిటీ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాలమ్మ అరుణ,విజయ భారతి,లలితమ్మ,సరోజినీ దేవి, షంషాద్ బేగం,వెంకటరమణ,వెంకటేశ్వర్లు,మల్లిఖార్జున రెడ్డి,నాగ శేషులు,రామి రెడ్డి సిబ్బంది మురళీ కృష్ణ,పాములేటమ్మ పాల్గొన్నారు.