NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘హ్యాండ్స్​’ సేవ ముసుగులో దోపిడీ…

1 min read

డోన్లో తనిఖీ చేస్తున్న అధికారులు ( ఫైల్ )

డోన్​, పత్తికొండ, నందికొట్కూరు,గుత్తిలో అవినీతి అక్రమాలు..

  • సిబ్బంది జీతాల్లో.. కక్కుర్తి…
  • జీతంలో నుంచి రూ.3వేలు ఇస్తేనే ఉద్యోగంలో కొనసాగింపు…
  • అందులోనూ ఎస్సీ ఎస్టీలకు అవకాశం లేదంటూ బెదిరింపు…
  •  ఎన్జీ ఓలో చక్రం తిప్పుతున్న ఓ మహిళ
  • ఆమె చెప్పిందే వినాలంటూ హుకుం…
  • ఇటీవల డోన్​, పత్తికొండలో ఏపీ సాక్స్​ అధికారుల తనిఖీ
  • అవినీతి బయట పడినా… వెల్లడించని అధికారులు
  • ఎన్జీఓను వెనకేసుకు రావడంలో మతలమేమిటో..
  • నెలసరి మామూళ్లతో తలొగ్గారంటూ ఆరోపణ
  • రేపు అనంతపురం జరిగే రాష్ట్ర స్థాయి మీటింగ్​లో  ఎన్జీఓలపై చర్చ..

కర్నూలు, న్యూస్​ నేడు:ప్రజలకు సేవ చేస్తామంటూ ప్రభుత్వ అనుమతి పొందిన  హ్యాండ్స్​ అనే స్వచ్ఛంద సంస్థ .. సేవ ముసుగులో దోపిడీ చేస్తోంది. వైద్యశాఖకు అనుబంధంగా  ఉంటూ సేవ చేస్తామన్న ఎన్జీఓ .. హెచ్​ఐవి బాధితులకు  అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ డోన్​, నందికొట్కూరు, పత్తికొండ, గుత్తిలో  సేవకు అనుమతి పొందిన  హ్యాండ్స్​ నిర్వాహకులు ఏడాదికోసారి ర్యాలీ చేస్తూ…. పబ్బం గడిపేస్తున్నారు.  అంతేకాక ఆయా ప్రాంతాల్లో హ్యాండ్స్​ కార్యాలయాలకు అనుమతి పొంది.. వాటి నెలసరి అద్దె డబ్బును నేరుగా  ఎన్జీఓ నిర్వాహకుడి అకౌంట్​లోకి పడుతుందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పై ఎన్నో సిబ్బంది, ప్రజలు ఆరోపణలు చేయడంతో ఇటీవల పత్తికొండ, డోన్​లో  ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పలు విషయాలపై ఆరా తీశారు.

పత్తికొండ టి ఐ ఎన్ జి ఓ అక్రమాలపై విచారణ..

ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు, జిల్లా అడిషనల్ ఆదేశాల ప్రకారం పత్తికొండ ఏరియా నందు హాండ్స్ నిర్వహిస్తున్న హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రోగ్రాం లో అక్రమాల గురించి అప్పటి సిపిఎం వెంకటరత్నం ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న కోర్ ఇండికేటర్ ల గురించి రివ్యూ చేశారు. జిల్లాలో తక్కువ స్థాయి పెర్ఫార్మెన్స్ ఉన్నందుకు వివరణ కోరినట్లు సమాచారం. సిబ్బందిని తొలగించడం గురించి, సిబ్బందితో డబ్బులు వసూలు చేసే విషయం గురించి, హెచ్ఐవి తో నివసిస్తున్న వారిని ఇబ్బందికి గురి చేసే విషయం గురించి, వ్యక్తిగతంగా మహిళలను ఇబ్బంది పెట్టే విషయం గురించి, ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే విషయం గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రాజెక్ట్ స్థాయిలో ప్రెసిడెంట్ అలివేలమ్మ మరియు నారాయణస్వామి సిబ్బందితో తీసుకున్నటువంటి అమౌంట్ గురించి విచారించడ జరిగింది.  సిబిఎస్ ద్వారా హెచ్ఐవి కి సంబంధించిన  కిడ్స్ చేయకుండా పాడేస్తున్నారు దీని పై చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు .ప్రాజెక్ట్ మేనేజర్ మరియు సిబ్బందితో రాతపూర్వకంగా  సంజయ్సీ తీసుకోవడం అయినది.

డోన్​లోనూ..ఏపీ సాక్స్ అధికారులు ఆకస్మిక  తనిఖీ

 హాండ్స్  నిర్వహిస్తున్న హెచ్ఐవి ఫ్రెషన్ ప్రోగ్రాం డోన్ నందు ఏపీ సాక్స్ అధికారులు డిప్యూటీ  డైరెక్టర్ మరియు డిపిఎంస్ వెంకటరత్నం మరియు ఆలీ హైదర్ విజిట్ చేశారు. హ్యాండ్స్ టి ఐ లో జరుగుతున్న అక్రమాల గురించి, సిబ్బందితో చర్చించి వివరణ తీసుకోవడం జరిగింది. హాండ్స్ మేనేజ్మెంట్ వారు అవలంబిస్తున్న చర్యల గురించి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల గురించి సిబ్బందితో లిఖితపూర్వకంగా వివరణ తీసుకోవడం అయినది. డోన్​ కూడా పత్తికొండ తనిఖీలో వెలుగు చూసిన వాస్తవాలే బయట పడటంతో ప్రాజెక్టు మేనేజర్​, సిబ్బందితో రాతపూర్వకంగా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎన్జీఓ పై … ఆరోపణలివి…

1). పాత స్టాఫ్ ను తీయడం కొత్త స్టాఫ్ ని పెట్టుకొని వారి ద్వారా ప్రతినెల రూ. 3000 అమౌంట్ తీసుకుంటారు.

2). హెచ్ఐవి తో నివసిస్తున్న సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్నారు..

3). ఆఫీసు రెంటు ను కాజేస్తున్నారు :

1.గుత్తి 7,500 .00 (ఒక ఆఫీసు మాత్రమే)

2.డోన్ 8000.00 (ఒక ఆఫీసు ఒక డిఐసి మాత్రమే)

3.పత్తికొండ 4500.00 (ఆఫీసు మాత్రమే )

4.నందికొట్కూర్ 5500.00( ఒక ఆఫీసు మాత్రమే)

. ఇలా నెలకు దాదాపు  40,000  ఎన్జీఓ నిర్వాహకుడు దిగమింగుతున్నట్లు తెలిసింది. అంతేకాక

4. ప్రోగ్రాం అమౌంట్ గురించి దొంగ బిల్లులతో కాజేస్తున్నారు..

5. ఇతర పనులకు కూడా ఉపయోగించుకుంటున్నారు సిబ్బందిని

7). నందికొట్కూరు ప్రాజెక్టులో అకౌంటెంట్  రజియా అకౌంటు ద్వారా అమౌంట్ వసూలు చేస్తున్నారు.

8.) కండోమ్స్ ని కాల్ చేస్తా ఉన్నారు

9.) పత్తికొండ ప్రోగ్రెస్ లేకున్నా కేవలం ఐదు మందితోనే మిగతా జీతాలు కాజేస్తున్నారు .

10.) CAST ఫీలింగ్ ,కుల వివక్షత. ఎస్సీ ఎస్టీ వాళ్ళని హీనంగా తిడుతూ వారిని ఇబ్బందులు కలగజేస్తున్నారు.

11. టి ఐ ప్రోగ్రాం కాకుండా వేరే ప్రోగ్రాంలో పని చేయించడం

రేపు అనంతరపురంలో మీటింగ్​..

అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్​ ఆఫ్​ విజయవాడ విశ్వేరయ్య ప్రసాద్​ తో స్వచ్ఛంద సంస్థల నిర్వాహణపై సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొందరు హ్యాండ్స్​  అక్రమాలపై రాష్ట్ర అధికారి విశ్వేరయ్య ప్రసాద్​ దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *