PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేంపెంట ను సందర్శించిన కలెక్టర్..ఎమ్మెల్యే

1 min read

గ్రామంలో ఇంకా శానిటేషన్ మెరుగు పడాలి

త్రాగు నీటిని సరఫరా చేసేందుకు తగు చర్యలు:కలెక్టర్

గ్రామ అభివృద్ధికి కృషి:ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వేంపెంట గ్రామంలో శానిటేషన్ పనులు ఇంకా మెరుగు పడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.మంగళవారం మ 3:30 కు నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని వేంపెంట గ్రామాన్ని కలెక్టర్ రాజకుమారి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించారు. గత ఐదు రోజులుగా గ్రామంలో అతి సారా తో గ్రామానికి చెందిన 18 మంది ఆస్పత్రుల్లో చేరారు.ఒక మహిళ అతి సారా తో గత మూడు రోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే.మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ ఎమ్మెల్యే పరామర్శించి వారితో కలెక్టర్ మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి పాత్రికేయులతో మాట్లాడుతూ 18 మందిలో ఆరు మంది డిశ్చార్జ్ అయ్యారని మిగతా 12 మంది ఆత్మకూరు నంద్యాల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. నీటిని పరీక్ష చేయించి త్రాగునీటి సరఫరాను బంద్ చేయించడం జరిగిందని క్లోరినేషన్ చేసి అన్ని విధాలుగా త్రాగునీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో ఇంకా శానిటేషన్ మెరుగు పడాలని త్రాగునీటిని సరఫరా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి సరఫరా చేస్తామని కలెక్టర్ అన్నారు. తర్వాత ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ అతిసారా వచ్చిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని గ్రామ అభివృద్ధి గురించి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.కలెక్టర్ గ్రామంలో తిరిగి గ్రామంలో శానిటేషన్ పనులు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో ఎం దాసు, ఆరోగ్యశాఖ అధికారులు మరియు మండల అధికారులు పాల్గొన్నారు.

About Author