కొంప ముంచిన అత్యాశ..
1 min read
తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని..
ఘరానామోసం..
- రూ.7.82 కోట్ల నగదు టోకరా..
- నెల్లూరు జిల్లా కావలికి చెందిన నలుగురు దుండగులు..
- కేసు ఛేదించిన త్రీ టౌన్ , వన్ టౌన్ సీఐలు సీఐ శేషయ్య , నరసింహులు
- రూ.6 లక్షలు నగదు, నాలుగు కార్లు, చిన్న నకిలీ బంగారు బిస్కెట్లు 15, పెద్ద నకిలీ బంగారు బిస్కెట్లు 16 స్వాధీనం
- అభినందించిన డీఎస్పీ బాబు రాజేంద్ర ప్రసాద్
కర్నూలు క్రైం, న్యూస్ నేడు: బంగారం ధర రోజురోజుకు కొండెక్కుతోంది.. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని చెప్పగానే.. ఆశ హద్దులు దాటింది. అత్యాశకు పోయి.. నిలువు మోసానికి గురిచేసింది. విజయవాడలోని చెందిన డా. రాజేంద్ర ప్రసాద్ అత్యాశకు పోయి… కోట్ల రూపాయలు ఇచ్చి దుండగల చేతిలో మోసపోయాడు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను డీ ఎస్పీ బాబు రాజేంద్ర ప్రసాద్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పోతురాజు రతన్ కుమార్, జస్వంత్, వసంత్, విశ్వనాథ్, దేవరకొండ సుధీర్, పీటర్ పాల్ మరియు శివకుమార్ రెడ్డి అనే దుండగలు తమ వద్ద బంగారం ఉందని, తక్కువ ధరకు విక్రయిస్తామని ఆశ చూపి..విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్ నుంచి రూ.7.32 కోట్లు వసూలు చేశారు. బంగారం ఇవ్వాలని బాధితుడు గట్టిగా అడిగినందుకు కర్నూలులోని పావని లాడ్జికి రమ్మని పిలిపించి.. అక్కడ బెదిరించి మరో రూ.50వేలు బలవంతంగా తీసుకున్నట్లు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సీఐ శేషయ్య, వన్ టౌన్ సీఐ నరసింహులు, సిబ్బందితో కలిసి జూన్ 26న నెల్లూరు జిల్లా కావలిలో ముద్దాయి దేవరకొండ సుధీర్ ఇంటికి వెళ్లగా.. పోలీసులు వస్తున్నారని పసిగట్టి ముందుగానే అక్కడి నుంచి అక్కడ నుండి దేవరకొండ సుధీర్, పీటర్ పాల్ మరియు శివకుమార్ రెడ్డి పారిపోయినారు. దీంతో కావాలి MRO కార్యాలయ సిబ్బందితో కలిసి ఇంటిని పరిశీలించగా… క్యాష్ కౌంటింగ్ మిషన్-2, పోలీస్ లారీలు -2, హ్యాండ్ కప్స్ విత్ కీ – 1, 2 50-1. 2 4 -2, 2 (1) సెల్ ఫోన్లు, కార్లు, ల్యాబ్ ట్యాబ్ , వాకి టాకీలు-2, రెండు పోలీస్ యూనిఫామ్స్ B) 200 వందల రూపాయల నోట్ల కట్టలు-2 వాటి మొత్తం 40,000/- రూపాయలు ఉండినవి. బయట 9) ఇంటి బయట నంటర్ లేని బోలెరో వాహనము స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు ఎంఎస్9 లాడ్జిలో…
ఆ తరువాత DSP కర్నూలు ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముద్దాయిల గురించి వెతకగా, 30.06.2025 వ తేదీన ఉదయము 08.30 గంటల సమయంలో కర్నూలు టౌన్ దేవనగర్, MS9. లాడ్జ్, రూమ్ నెంబర్ 201 లో పై తెలిపిన ముద్దాయిలు ఉన్నారు అని తెలిసి CI శేషయ్య తన సిబ్బంది సహాయముతో లాడ్జ్ కు వెళ్ళి అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4 చిన్న పోన్స్, 3 స్మార్ట్ పోన్స్, చిన్న దొంగ బంగారము బిస్కెట్స్16, పెద్ద దొంగ బంగారము బిస్కెట్స్-15, రూ.6,00,000/- నగదు మరియు మూడు కార్లను పంచాయితదారుల సమక్షములో సీజ్ చేశారు. మిగితా ముద్దాయిలు దేవరకొండ సుధీర్, పీటర్ పాల్ మరియు శివకుమార్ రెడ్డి పరారీలో వున్నారు.
సీఐని అభినందించిన డీఎస్పీ
రాష్ట్ర స్థాయిలో జరిగిన చోరీ కేసును తక్కువ సమయంలో ఛేదించిన త్రీ టౌన్ సీఐ శేషయ్యను డీఎస్పీ బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియా సమక్షంలో అభినందించారు.

