లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన .బి.వీరభద్ర గౌడ్
1 min read

న్యూస్ నేడు ఆలూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు. ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి.వీరభద్ర గౌడ్ ఆలూరు పట్టణం 3వవార్డులో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు వారి చేతులమీదుగా పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే సూపర్6 పథకాలలో భాగంగా పెన్షన్ దారులకు నెలనెలా 4వేలు ఇస్తామని బాబుగారు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా .బి.వీరభద్ర గౌడ్ ఆలూరు పట్టణంలో 3వవార్డులో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వారి సిబ్బంది,మండల,డివిజన్, వార్డు అధ్యక్షులు/క్లస్టర్,యూనిట్,బూత్,సెక్షన్ ఇంచార్జి లు/తాలూకా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న టిడిపి కూటమి నాయకులు,కార్యకర్తలుతెలుగు యువత, ఐటిడిపి,టిఎన్ఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, నాయకులు, నందమూరి,నారా,బివిజి అభిమానులు అందరూ సచివాలయ సిబ్బంది అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

