NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాబార్డ్ 44వ వ్యవస్థాపక దినోత్సవం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి మండలంలోని కలచట్ల గ్రామంలో వాటర్షెడ్ కమిటీ మరియు సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఎకో డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో    శనివారం రైతులతో కలిసి నాబార్డ్ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నాము. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ నాబార్డ్ కలచట్ల గ్రామం నందు చేస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది. వాటర్ షెడ్ ట్రెజరర్ రవి మాట్లాడుతూ నాబార్డ్ రైతులకు గ్రామీణ ప్రాంతాలకు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తుందని, వాటర్షెడ్ నందు పొలంలో యందు, వాగుల యందు పనులు, సి సి ఏ ఆక్టివిటీ కింద, ఆర్​ఓ వాటర్ ప్లాంట్,  ట్యాంకర్లు, వ్యవసాయ పనిముట్లు మంజూరు అయినవని, మరియు జీవనోపాదుల కింద వివిధ రకాల యూనిట్లకు లోన్లు ఇవ్వడం జరిగింది. మన గ్రామానికి ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్న నాబార్డ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమావేశం తర్వాత మొక్కలు నాటడం, రైతులతో ర్యాలీ చేశారు.ఈ కార్యక్రమానికి పి ఎఫ్ ఎస్ సిబ్బంది ఇంజనీర్ రాకేష్ వర్మ మేనేజర్ సుబ్రమణ్యం , సూపర్వైజర్ ఈశ్వర్  కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author