NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు 

1 min read

స్వామివారిని దర్శించుకున్న పూర్వపు ఈవో ఆకుల కొండలరావు దంపతులు

వివిధ సేవల రూపేణ రూ:2,36,100/- లు ఆదాయం

నిత్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ

ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు

కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి.చందన

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : గురవాయిగూడెం గ్రామములో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద  శనివారం ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రవేత్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు.వేద పండితులు,అర్చకులు వేద ఆశీర్వచనంతో శేష వస్త్రములు,ప్రసాదాలు అందించారు. అధిక సంఖ్యలో పాల్గొని భక్తుల ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ,విరాళాల  ద్వారా   రూ 2,36,100/-లు  సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో  భక్తులు  అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీస్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారిణి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేసినట్లు ఆర్.వి. చందన ఒక ప్రకటనలో తెలిపారు.

About Author