PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన బేష్​…

1 min read

బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  కర్నూలు జిల్లా  పత్తికొండ టౌన్ లో గురువారం రోజున నిర్వహించిన వందరోజుల పాలనలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పత్తికొండ బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు బిజెపి నాయకులు, సచివాలయం  సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను అతికించి, 100 రోజులలో చేసిన ప్రజా సంక్షేమ పథకాలను అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణ దిశగా 2047 విజన్ ఆంధ్ర ప్రదేశ్ గా అడుగులు వేయాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజా వేదికలో పాల్గొని వంద రోజుల కూటమి ప్రభుత్వంలో నెరవేర్చిన హామీల తో పాటు, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ దండి మల్లికార్జున,మండల అధ్యక్షులు శంకరయ్య ఆచారి, పూనా మల్లికార్జున, బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం నరేష్, చంద్ర, కిసాన్ మోర్చా నాయకులు జై భీమ్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపద్యక్షులు ఆవుల సోమన్న, కూటమి తెలుగు యువత నాయకులు బిటి పవన్, వినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author