NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయలసీమను రతనాలసీమగా మారుస్తా: సీఎం

1 min read

మల్యాలలో రెండు పంపుల నీళ్లు విడుదల

పాఠశాలలకు డీఎస్సీ టీచర్లు

మిడుతూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 60 కోట్లు

హంద్రీనీవాకు జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు

మల్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు..

హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: రాయలసీమ రాళ్ల సీమ కాదురాబోయే రోజుల్లో రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం అందరినీవా కాలువకు 8,9,10 పంపుల ద్వారా 1,050 క్యూసెక్కుల నీటిని బటన్ నొక్కి గురువారం మ 2 గంటలకు నీటిని విడుదల చేశారు.తర్వాత నీటిలో జలహారతి చేశారు.హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు,బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్,నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంటు టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.తర్వాత జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో

గిత్త జయసూర్య ఎమ్మెల్యే నందికొట్కూరు

నందికొట్కూరులో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా పెంచాలని, మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని,మిడుతూరు మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. పింఛన్ల పెంపుతో అవ్వా తాతలు,దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపీ నంద్యాల..

గత ప్రభుత్వంలో రైతులను ఎవరూ పట్టించుకోలేదని అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల కొరకు నిధులు మంజూరు చేయాలని ఈ నియోజకవర్గంలో ఇంతవరకు టీడీపీ జెండా ఎగరలేదని రాబోయే రోజుల్లో ఇక్కడ ఎప్పటికీ టిడిపి జెండా ఎగరాలని ఎంపీ అన్నారు.

నన్ను భయపెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను భయపడను:సీఎం

నన్ను భయపెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను భయపడనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1995లో హంద్రీనీవాకు శ్రీకారం చుట్టాం 554 కిలోమీటర్లు చిత్తూరు కుప్పం నకు నీళ్లు వెళ్తున్న పెద్ద ప్రాజెక్టు ఇది. 3850 క్యూసెక్కుల నీళ్ళు 40 టీఎంసీ ల నీళ్లు తీసుకెళ్తున్నాం. ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని అన్నారు.హంద్రీ నీవాకు జగన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు గంపెడు మట్టి తీయలేదని ప్రాజెక్టులను మేము బాగు చేస్తుంటే వైసీపీ వాటిని చెడగొడుతుందని జగన్ పై సీఎం విమర్శలు గుప్పించారు.2వేల కోట్లతో  రోడ్లను నందనవనం చేశామని ఆగస్టు 20 లోపు పాఠశాలలకు డీఎస్సీ టీచర్లను నియమిస్తామన్నారు. నాయకులను పరిగెత్తించే బాధ్యత నాదే అధికారులు జవాబు దారీతనంతో పనిచేయాలని అన్నారు.

మిడుతూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 60 కోట్లు

హంద్రీనీవా కాలువ నుండి కలమందలపాడు-మిడుతూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు 60 కోట్లతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోజిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్,నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,డీఐజి కోయ ప్రవీణ్, కలెక్టర్ రాజకుమారి,అది రాజ్ సింగ్ రాణా,జేసీ విష్ణు చరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author