NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి  స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుండి రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను విడుదల కార్యక్రమానికి వెళ్లేందుకు జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడుకి పలువురు ప్రజా ప్రతినిధులు  ఘనంగా స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్ఎల్ సి బి.టి నాయుడు, కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి, పత్తికొండ ఎంఎల్ఏ శ్యామ్ బాబు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కురువ సంక్షేమ &   డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, రాష్ట్ర వాల్మీకి సంక్షేమ ,   డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, మాజీ  ఎంపీ సంజీవ్ కుమార్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, 2024 పార్టీ అభ్యర్ధులు రాఘవేంద్ర రెడ్డి (మంత్రాలయం), వీరభద్ర గౌడ్ (ఆలూరు), టీడీపీ నాయకులు తుగ్గలి నాగేంద్ర తదితరులు ఉన్నారు.

About Author