PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భాష్యం స్కూల్లో ఘనంగా ముందస్తు దసరా వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సీఈవో అనీల్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో ముందస్తు దసరా పండగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ అశ్వయిజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయిజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదసిమిని కలపి దసరా పండగను జరుపుకుంటామన్నారు. చెడు మీద మంచి విజయం సాధించిన గుర్తుగా దేవతామూర్తులను పూజిస్తూ దసరా నవరాత్రులు జరుపుకుంటామని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవార్లు ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారని తెలిపారు. ఇదే పండుగను తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది రోజులు అమవాస్య నుంచి నవమి వరకు బతకమ్మ అడతారని చెప్పారు. రెండు తెలుగురాష్ట్రాల్లో దసరా పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల అధ్యాపకలు, అధ్యాకతేర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author